రేవాజీ కుటుంబానికి కేంద్ర మంత్రి బండి ప‌రామ‌ర్శ‌

రేవాజీ కుటుంబానికి కేంద్ర మంత్రి బండి ప‌రామ‌ర్శ‌ కాకతీయ, వరంగల్ ప్రతినిధి : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) జేష్ఠ కార్యకర్త రేవాజీ రేవా కోటేశ్వరరావు కుటుంబాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ ఆదివారం పరామర్శించారు. వరంగల్‌ డాక్టర్స్‌ కాలనీలోని రేవాజీ నివాసానికి వెళ్లి, ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా బండి సంజయ్ మాట్లాడుతూ, రేవాజీ వంటి అఖండ త్యాగి, క్రమశిక్షణ గల స్వయంసేవకుడు ఇక లేరనే విషయం తీవ్ర విషాదం కలిగించిందని చెప్పారు....