కాక‌తీయుల మ్యూజియం ప్రారంభ‌మెప్పుడు..?

కాక‌తీయుల మ్యూజియం ప్రారంభ‌మెప్పుడు..? నిర్మాణం పూర్త‌యి మూడేళ్లు.. ప్రారంభించ‌కుండా నిర్ల‌క్ష్యం కోట్ల రూపాయల నిర్మాణం పోకిరీల పాలు.. పటించుకొని పర్యాటక శాఖ కాకతీయుల ఘన చరిత్రను ప్రస్తుత తరానికి అందించలేమా? కాకతీయ, వరంగల్ ప్రతినిధి : వరంగల్  జిల్లా లోని ఓరుగల్లు కోట చారిత్రకంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. కాకతీయ రాజుల రాజధాని ఓరుగల్లు కోట ఎంతో అభివృద్ధి చెందింది కానీ ఇప్పటి పాలకుల నిర్లక్ష్యానికి ఓరుగల్లు కోట అభివృద్ధికి నోచుకోవడం లేదు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చారిత్రక కట్టడాలను పరిరక్షించి టూరిజంగా అభివృద్ధి చేయాలని...