అభివృద్ధే లక్ష్యం కావాలి
అభివృద్ధే లక్ష్యం కావాలి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కాకతీయ, కరీంనగర్ : పల్లెపల్లెల్లో కొనసాగుతున్న అభివృద్ధి యాత్రను మరింత వేగవంతం చేయాలంటే రానున్న పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేస్తున్న అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఇల్లంతకుంట మండల పరిధిలో ఏకగ్రీవంగా ఎన్నికైన ఎనిమిది మంది సర్పంచులు, పలువురు వార్డు సభ్యులు ఎల్ఎండీ కాలనీలోని ప్రజాభవన్‌లో ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏకగ్రీవంగా ఎనిమిది పంచాయతీలు ఎన్నిక కావడం ప్రజల్లో ప్రభుత్వం చేస్తున్న...