తిమ్మాపూర్ మండలంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి ప్రచారం
తిమ్మాపూర్ మండలంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి ప్రచారం కాకతీయ, కరీంనగర్ : తిమ్మాపూర్ మండలంలో పంచాయతీ ఎన్నికల ప్రచారం మరింత వేడెక్కుతోంది. సోమవారం ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ తిమ్మాపూర్, రామకృష్ణకాలనీ, ఇందిరానగర్, కొత్తపల్లి, జూగుంట్ల గ్రామాల్లో ప్రజల్లోకి వెళ్లి అధికార అభ్యర్థులకు మద్దతు కోరారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమం,అభివృద్ధిని సమతూకంగా ముందుకు తీసుకెళ్తోందన్నారు. రెండుేళ్లలో చేసిన పనులు గత బీఆర్ఎస్ పాలనలో కనిపించలేదని స్పష్టం చేశారు. గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ సర్పంచులు కీలకమవుతారని, ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాలకు లొంగకుండా...