ఆంజనేయ స్వామి ఆలయంలో దొంగతనం
ఆంజనేయ స్వామి ఆలయంలో దొంగతనం కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : మధిర మండలం తొండలగోపవరం గ్రామపంచాయతీ పరిధిలోని సాయిపురం ఆంజనేయ స్వామి గుడిలో దొంగలు పడి హుండీని పగలగొట్టినట్టు సంచారం నెలకొంది. ఆదివారం అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు గుడి తాళాలు విరగదీసి లోనికి చొరబడి, భక్తులు సమర్పించిన కానుకలతో ఉన్న హుండీని ధ్వంసం చేసినట్టు స్థానికులు పేర్కొంటున్నారు. ఉదయం గుడికి వచ్చిన భక్తులు హుండీ పగిలి ఉండటాన్ని గమనించి గ్రామస్తులకు సమాచారం అందించారు. సంఘటనతో గ్రామంలో కలకలం నెలకొంది. విషయం తెలిసిన...