శిశుమందిర్‌లో అవినీతి వ్యతిరేక భావజాలం

శిశుమందిర్‌లో అవినీతి వ్యతిరేక భావజాలం విద్యార్థుల్లో చైతన్యం పెంపొందించిన హమ్ కాకతీయ, కరీంనగర్ : అవినీతి నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని హమారా ఉన్నత్ మార్గ్ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో శ్రీ సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీషు మిడియం హైస్కూల్‌లో అవినీతి వ్యతిరేక అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించగా విద్యార్థులు విశేషంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.వ్యాసరచన విభాగంలో బొమ్మ సాయి శ్రేష్ఠ ప్రథమ, నామాల దేవిశ్రీ ద్వితీయ, ఎర్ర అభిజ్ఞ తృతీయ స్థానాలను సాధించారు. ఉపన్యాస పోటీల్లో...