శ్యామ్‌రావును భారీ మెజారిటీతో గెలిపించాలి :మంత్రి సీతక్క
శ్యామ్‌రావును భారీ మెజారిటీతో గెలిపించాలి :మంత్రి సీతక్క కాకతీయ, ములుగు ప్రతినిధి: మల్లంపల్లి మేజర్ గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ల్యాద శ్యామ్‌రావు కు భారీ మెజారిటీతో విజయం సాధింపజేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళ,శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రజలను కోరారు. బుధవారం ఆమె మల్లంపల్లిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఇంటింటికి తిరిగి ఎన్నికల వాతావరణాన్ని మరింత ఉత్కంఠభరితంగా మార్చారు.ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం మల్లంపల్లి మండలం ఏర్పాటు చేశాం...