మంథనిలో నమ్మకద్రోహ రాజకీయాలు
మంథనిలో నమ్మకద్రోహ రాజకీయాలు ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌పై పుట్ట మధూకర్ ఘాటు వ్యాఖ్యలు కాకతీయ,మంథని : మంథని నియోజకవర్గంలో నమ్మిన నాయకులకే ద్రోహం చేయడం దుద్దిళ్ల శ్రీధర్ రాజకీయ శైలిగా మారిందని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బుధవారం మంథని పట్టణంలోని రాజగృహాలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ కోసం మూడు దశాబ్దాలుగా కష్టపడిన నాయకులను సర్పంచ్ అభ్యర్థుల ఎంపిక సమయంలో పూర్తిగా పక్కనబెట్టడం దారుణమన్నారు.ప్రజల్లో, కార్యకర్తల్లో ఎమ్మెల్యేపై నమ్మకం పూర్తిగా కోల్పోయిందని, ఇదే విషయాన్ని వరుసగా హెచ్చరిస్తున్నా...