అధికార పార్టీ అభ్యర్థులనే గెలిపించాలి

అధికార పార్టీ అభ్యర్థులనే గెలిపించాలి : ఎమ్మెల్యే కవ్వంపల్లి కాకతీయ, కరీంనగర్ : అధికార పార్టీ ఆశీర్వాదంతో నిలబడ్డ అభ్యర్థులను సర్పంచులుగా గెలిపిస్తేనే గ్రామాల అభివృద్ధి వేగవంతమవుతుందని మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. గురువారం ఇల్లంతకుంట మండలంలోని పొత్తూరు, కందికట్కూర్, ఓగులాపూర్, వెల్జీపూర్, గొల్లపల్లి, వెంకట్రావుపల్లి, సోమారంపేట, రేపాక గ్రామాల్లో సర్పంచు అభ్యర్థులతో కలిసి ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే గత బీఆర్ఎస్ పాలనలో పంచాయతీ వ్యవస్థ కుంగిపోయిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పంచాయతీల బలోపేతానికి...