ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మిడ్ డే మిల్స్ ఏర్పాటు చేయాలి
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మిడ్ డే మిల్స్ ఏర్పాటు చేయాలి జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత కాకతీయ, హైదరాబాద్ : రాష్ట్రంలోని పేద విద్యార్థులు చదువుకుంటున్న ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులు ఉత్తీర్ణశాతం పెంచేందుకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. జాగృతి జనం బాటలో భాగంగా అంబర్ పేట నియోజకవర్గంలోని కాచిగూడ ప్రభుత్వ జూనియర్ కళాశాలను శుక్రవారం ఆమె సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి కళాశాలలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు....