రెండో విడత ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
రెండో విడత ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలి భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ కాకతీయ, కొత్తగూడెం : భద్రాద్రి జిల్లాలో ఆదివారం నిర్వహించనున్న రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల ప్రక్రియను శాంతియుతంగా పారదర్శకంగా స్వేచ్ఛాయుతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లాలోని ఏడు మండలాల్లో 155 గ్రామపంచాయతీలకు సర్పంచ్, 1,392 వార్డులకు ఎన్నికలు నిర్వహించాల్సి...