నేడు ఐఎల్పీఏ రాష్ట్ర సదస్సు

నేడు ఐఎల్పీఏ రాష్ట్ర సదస్సు కాక‌తీయ‌, కొత్తగూడెం : ఇండియన్‌ లీగల్‌ ప్రొఫెషనల్స్‌ అసోసియేషన్‌ (ఐఎల్పీఏ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఐదో రాష్ట్ర మహాసభ ఆదివారం కొత్తగూడెం క్లబ్‌లో జరగనుంది. ఈ సదస్సును న్యాయవాదులందరూ విజయవంతం చేయాలని ఐఎల్పీఏ జిల్లా కన్వీనర్‌ జే.గోపికృష్ణ శనివారం ఒక ప్రకటనలో కోరారు. న్యాయవాదుల హక్కులు, సమస్యలు, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని 'బ్లాక్‌ కోట్స్‌ ఫర్‌ బ్లూ రెవల్యూషన్‌' నినాదంతో ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. వృత్తిపరమైన, సామాజిక, ఆర్థిక సమస్యలపై పోరాటంతో పాటు, అట్టడుగు వర్గాల న్యాయవాదులను...