శాంతియుత ఎన్నికల నిర్వహణే ప్రధాన లక్ష్యం
శాంతియుత ఎన్నికల నిర్వహణే ప్రధాన లక్ష్యం మహబూబాబాద్ ఎస్పీ శబరీష్ కాకతీయ, మహబూబాబాద్ : జిల్లాలో నిర్వహించనున్న రెండవ విడత పంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని రకాల భద్రతా చర్యలను పకడ్బందీగా చేపట్టామని జిల్లా ఎస్పీ డా. శబరీష్ తెలిపారు. రెండవ విడత పంచాయతీ ఎన్నికల కోసం 5 డిఎస్పీలు, 17 సీఐలు, 50 ఎస్.ఐలు మొత్తం 1200 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రతి గ్రామంలో పకడ్బందీ భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు....