అదనపు కట్నం కోసం కోడలిని హత్య
అదనపు కట్నం కోసం కోడలిని హత్య ఆత్మహత్యగా చిత్రీకరించి పరారీ కొమ్ముగూడెంలో దారుణం కాకతీయ, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ మండలం కొమ్ముగూడెం గ్రామంలో అదనపు కట్నం కోసం కోడలిని హత్య చేసిన దారుణ ఘటన కలకలం రేపింది. కోడలు స్వప్నను అత్తింటివారు అతి కిరాతకంగా కొట్టి చంపి, ఆత్మహత్యగా చిత్రీకరించి పరారైనట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. స్థానికుల కథనం ప్రకారం.. స్వప్నను కొంతకాలంగా అదనపు కట్నం కోసం అత్త, మామ, భర్త, మరిది వేధింపులకు గురిచేస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఆమెను తీవ్రంగా...