రెండో విడత గ్రామపంచాయతీ పోలింగ్‌ ప్రారంభం

రెండో విడత గ్రామపంచాయతీ పోలింగ్‌ ప్రారంభం ఉదయం నుంచే కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు కొత్తగూడెం, కాకతీయ రూరల్ : జిల్లాలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ఆదివారం ఉదయం 7 గంటలకు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైంది. ఎన్నికలు నిర్వహిస్తున్న అన్నపురెడ్డిపల్లి, అశ్వరావుపేట, చంద్రుగొండ, చుంచుపల్లి, దమ్మపేట, ములకపల్లి, పాల్వంచ మండలాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు ఉదయాన్నే బారులు తీరారు. పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచే ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును ఉత్సాహంగా వినియోగించుకుంటున్నారు....