ఇండిగో కష్టాలు.. ప్రయాణికులకు అగచాట్లు

ఇండిగో కష్టాలు.. ప్రయాణికులకు అగచాట్లు శంషాబాద్‌లో టైమ్ అయిందంటూ గేట్ క్లోజ్ కాక‌తీయ‌, శంషాబాద్ : ఇండిగో విమానయాన సంస్థ వైఖరి విమాన ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. శంషాబాద్‌ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో తాజాగా చోటుచేసుకున్న ఘటన ప్రయాణికుల్లో ఆగ్రహాన్ని రేకెత్తించింది. టికెట్లు తీసుకుని ఎయిర్‌పోర్ట్‌లోకి వెళ్లేందుకు లైన్‌లో నిలబడ్డ ప్రయాణికులను ఇండిగో సిబ్బంది ‘సమయం అయిపోయింది’ అంటూ లోపలికి అనుమతించలేదు. కొంతమందిని మాత్రమే లోపలికి పంపిన అనంతరం గేట్‌ను అకస్మాత్తుగా మూసివేయడంతో పలువురు ప్రయాణికులు అవాక్కయ్యారు. ఈ విషయమై ప్రశ్నించగా, సమయం...