డ్రైనేజీ చాంబర్లతో ధ్వంసమైన రోడ్లు

డ్రైనేజీ చాంబర్లతో ధ్వంసమైన రోడ్లు పొర్లుదండాల తో వినూత్నంగా నిరసన చేసిన యువకుడు స్మార్ట్ సిటీ పనులపై జనాగ్రహం కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కింద చేపట్టిన అండర్ డ్రైనేజీ పనులు కిసాన్నగర్ 3వ డివిజన్‌లో ప్రజలకు తీరని ఇబ్బందులు కలిగిస్తున్నాయి. డ్రైనేజీ చాంబర్లు సక్రమంగా పూర్తికాకపోవడంతో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. రహదారులపై పెద్ద పెద్ద పగుళ్లు ఏర్పడి, వర్షపు నీరు-మురుగు నీరు నిలిచిపోవడంతో కాలనీవాసులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ద్విచక్ర వాహనదారులు తరచూ జారి పడుతుండగా, వృద్ధులు, పిల్లలు...