క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతో తోడ్పడతాయి
క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతో తోడ్పడతాయి : వెలిగంటి రవి కాకతీయ,వరంగల్ సిటీ : క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతో తోడ్పడతాయని జాగృతి నాయకుడు వెలిగంటి రవి తెలిపారు. ఖిలా వరంగల్ మైదానంలో సోమవారం జరిగిన రాణి రుద్రమదేవి ప్రీమియర్ లీగ్ సీజన్ ఫోర్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్స్లో ప్రధాన అతిథిగా హాజరైన రవి, గెలుపు పొందిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. ఆర్.పి.ఎల్ సీజన్ ఫోర్‌లో మొత్తం 10 టీములు పాల్గొన్నాయి. ఇందులో ఓరుగల్లు వారియర్స్ బీజేతగా నిలిచారు. వారికీ 20,000 రూపాయల నగదు...