అదుపుత‌ప్పిప లోయ‌వైపు దూసుకెళ్లిన టూరిస్టు బ‌స్సు

అదుపుత‌ప్పిప లోయ‌వైపు దూసుకెళ్లిన టూరిస్టు బ‌స్సు శ్రీశైలం వెళ్తున్న ఘ‌ట‌న‌... దోర్నాల ఫారెస్ట్ చెక్‌పోస్ట్ వ‌ద్ద ప్ర‌మాదం కాక‌తీయ‌, ప్రకాశం : ప్రకాశం జిల్లా దోర్నాల ఫారెస్ట్ చెక్‌పోస్ట్‌కు కూతవేటు దూరంలో శనివారం శ్రీశైలం వెళ్తున్న టూరిస్ట్ బస్సు అదుపుతప్పి రోడ్డు డివైడర్ మధ్యలో దూసుకెళ్లింది. ఈ ఘటనతో క్షణకాలం ఉద్రిక్తత నెలకొనగా, అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. బస్సులో పలువురు ప్రయాణికులు ఉండటంతో ప్రమాదం చోటుచేసుకుంటే తీవ్ర పరిణామాలు ఎదురయ్యే పరిస్థితి ఏర్పడింది. అయితే డ్రైవర్ అప్రమత్తతతో పెనుప్రమాదం తప్పినట్లు స్థానికులు తెలిపారు....