మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌పై అడ్లూరి ఫైర్
మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌పై అడ్లూరి ఫైర్ పదిేళ్ల అరాచకాలు,అవినీతి త్వరలో ప్రజల ముందే ఉంచుతా కాకతీయ, కరీంనగర్ బ్యూరో : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌పై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గత పది సంవత్సరాలుగా కొప్పుల ఈశ్వర్ పాలనలో జరిగిన అరాచకాలు, అవినీతి వ్యవహారాలన్నింటినీ త్వరలో ప్రజల ముందుంచుతామన్నారు. అబద్ధాలకు కేరాఫ్ అడ్రస్‌గా మీ ప్రభుత్వం మీ నాయకత్వమే మారిందని ఘాటుగా వ్యాఖ్యానించారు. సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసిన కాలంలో ఒక్క సంక్షేమ హాస్టల్ భవనం కూడా...