OUలో లంచం తీసుకుంటూ ఏఈఈ అరెస్ట్‌

ఏసీబీ వ‌ల‌లో ఏఈఈ లంచం తీసుకుంటుండ‌గా రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టివేత‌ కాక‌తీయ‌, హైదరాబాద్ : ఉస్మానియా విశ్వవిద్యాలయం (OU) ప్రాంగణంలో జరుగుతున్న పునరుద్ధరణ పనుల బిల్లులు విడుదల చేయడానికి లంచం డిమాండ్ చేసిన అధికారిని తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఓయూలో ఏఈఈగా పనిచేస్తున్న రాచకొంద శ్రీనివాసులు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మంగళవారం దాడులు చేసి పట్టుకున్నారు. ఓయూ ప్రాంగణంలో చేపట్టిన అభివృద్ధి, పునరుద్ధరణ పనులకు సంబంధించిన బిల్లులను త్వరగా ఆమోదించి విడుదల చేయిస్తానని చెప్పి సంబంధిత...