గ్రామాభివృద్ధికి సమిష్టి కృషి: సర్పంచి తమ్మడపల్లి కుమార్
గ్రామాభివృద్ధికి సమిష్టి కృషి: సర్పంచి తమ్మడపల్లి కుమార్ కాకతీయ, ఇనుగుర్తి : నాపై ఉంచిన నమ్మకంతో ఇనుగుర్తి గ్రామ ప్రజలు సర్పంచిగా గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ, అందరి సహకారంతో గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని నూతనంగా ఎన్నికైన మండల కేంద్రం ఇనుగుర్తి సర్పంచి తమ్మడపల్లి కుమార్ అన్నారు. మంగళవారం ఇనుగుర్తిలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు తదితరులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంతో చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి సర్పంచ్‌గా అవకాశం కల్పించిన గ్రామస్తుల నమ్మకాన్ని...