తప్పుడు ప్రచారాలతో ప్రజలను మోసం చేయొద్దు
తప్పుడు ప్రచారాలతో ప్రజలను మోసం చేయొద్దు *మంత్రి సీతక్క కాకతీయ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం మంత్రి సీతక్క మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మొదటి విడత, రెండవ విడత సర్పంచ్ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. గ్రామపంచాయతీలను గెలిపించడంలో కీలక పాత్ర పోషించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, అలాగే కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించిన ప్రజలందరికీ పంచాయతీరాజ్ శాఖ తరపున ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా...