ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి
ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి లోపాలకు తావులేకుండా చూడాలి: కలెక్టర్ పమేలా సత్పతి కాకతీయ, కరీంనగర్ : మూడవ (చివరి) విడతగా నిర్వహించనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలను ఎలాంటి లోపాలు లేకుండా, అత్యంత సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి ఎన్నికల సిబ్బందిని ఆదేశించారు. గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికలు-2025లో భాగంగా కరీంనగర్ జిల్లాలో ఈ నెల 17న చివరి విడత పోలింగ్ జరగనుంది. జమ్మికుంట, ఇల్లందకుంట, హుజురాబాద్, వీణవంక, వి.సైదాపూర్ మండలాల్లోని గ్రామ పంచాయతీలకు సర్పంచి, వార్డు సభ్యుల ఎన్నికలకు...