సింగరేణి సీఎండీగా కృష్ణ భాస్కర్ నియామకం

సింగరేణి సీఎండీగా కృష్ణ భాస్కర్ నియామకంప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు కాకతీయ, హైదరాబాద్ : సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఎస్‌సీసీఎల్‌) చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ప్రఖ్యాత ఐఏఎస్‌ అధికారి కృష్ణ భాస్కర్‌ను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. తదుపరి ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడే వరకు ఆయనే సీఎండీగా కొనసాగుతారని అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. తెలంగాణ రాష్ట్రానికి కీలకమైన శక్తి రంగంలో సింగరేణి ప్రధాన ప్రభుత్వ సంస్థగా ఉన్న నేపథ్యంలో, కృష్ణ భాస్కర్ పూర్తిస్థాయిలో సీఎండీ బాధ్యతలు నిర్వహిస్తారని...