25 రోజులుగా తాగునీరు లేక ప్రజల అవస్థలు

25 రోజులుగా తాగునీరు లేక ప్రజల అవస్థలు పిట్టలవాడ ఎస్సీ కాలనీలో మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కాకతీయ ,హుజురాబాద్: హుజురాబాద్ నియోజకవర్గం లోని జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డ్ పిట్టలవాడ ఎస్సీ కాలనీలో గత 25 రోజులుగా తాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. నీరు అందక కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.తాగునీరు, వంట, స్నానం వంటి కనీస అవసరాలకే ఇతర ప్రాంతాలపై ఆధారపడాల్సి వస్తోందని స్థానికులు వాపోతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలు, గర్భిణీలు అత్యధికంగా ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు.ఈ సమస్యపై...