ఖమ్మంలో పరిశ్రమల విస్తరణకు చర్యలు

ఖమ్మంలో పరిశ్రమల విస్తరణకు చర్యలు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి టీజీఐఐసీ భూములను క్షేత్రస్థాయిలో పరిశీల‌న‌ కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ఖమ్మం జిల్లాలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. మంగళవారం రఘునాథపాలెం మండలం జింకల తండా, పువ్వాడ నగర్ పరిధిలో తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల మౌళిక వసతుల అభివృద్ధి సంస్థ (టిజిఐఐసి)కు కేటాయించిన భూములను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పరిశ్రమల స్థాపనకు భూమి అనుకూలత, రహదారి అనుసంధానం, మౌళిక వసతుల లభ్యత...