కార్మికుల హక్కుల కోసం పోరాటం
కార్మికుల హక్కుల కోసం పోరాటం ప్రభుత్వం మాట ఇచ్చి తప్పింది బీజేపీ నేత ఎర్రబెల్లి ప్రదీప్‌రావు వ్యాఖ్యలు కాకతీయ, వరంగల్ ప్రతినిధి : వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఆజంజాహీ మిల్లు కార్మిక భవనం భూమి కబ్జా అంశం మళ్లీ రాజకీయ దుమారం రేపుతోంది. కార్మిక భవనం నిర్మాణంపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ అఖిలపక్ష నాయకులు, కార్మిక సంఘాల ప్రతినిధులు మరోసారి ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకుడు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి భర్తే...