చతుర్ముఖ లింగం, నంది విగ్రహాన్ని పరిరక్షించాలి
చతుర్ముఖ లింగం, నంది విగ్రహాన్ని పరిరక్షించాలి దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు వినతి కాకతీయ, ఖిలా వరంగల్ : ఖిలా వరంగల్ మధ్యకోటలో ఉన్న స్వయంభు శ్రీ శంభు లింగేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో భూమిలో సగభాగం కూరుకుపోయిన చారిత్రక చతుర్ముఖ లింగం, భారీ నంది విగ్రహాన్ని వెలికి తీసి పరిరక్షించాలని చారిత్రక కట్టడాల పరిరక్షణ కమిటీ ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఈ స్వయంభు దేవాలయంలో ప్రస్తుతం గ్రానైట్‌తో అభివృద్ధి పనులు కొనసాగుతున్న నేపథ్యంలో, ఆలయానికి ఉన్న...