ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు అతివేగమే ప్రమాదానికి కారణమా..? కాకతీయ,మరిపెడ: అతివేగంగా వచ్చిన రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన మరిపెడ మండలంలోని బురహాన్‌పురం గ్రామ శివారు పత్తి మిల్లు సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మరిపెడ మండలం తానంచర్ల పరిధిలోని రెడ్యా తండాకు చెందిన గుగులోతు సైదులు ద్విచక్ర వాహనంపై మరిపెడ మండల కేంద్రానికి వెళ్తుండగా, అదే సమయంలో బురహాన్‌పురం గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీకాంత్ మరిపెడ నుంచి స్వగ్రామానికి...