మంత్రి సురేఖ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ల మండిపాటు
‘చిల్లర గాళ్లు’ అన్న మాటలు వెనక్కు తీసుకోవాలి నల్గొండ రమేష్ ఇంట్లో మీడియా సమావేశం కాకతీయ, వరంగల్ ప్రతినిధి :మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్లు తీవ్రంగా స్పందించారు. పీసీసీ సభ్యుడు నల్గొండ రమేష్ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు ఆ వ్యాఖ్యలను ఖండించారు. ‘‘పట్టిన జెండాను విడవకుండా నలభై ఏండ్లుగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నాం. అలాంటి సీనియర్లను ‘చిల్లర గాళ్లు’ అంటూ మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడటం తీవ్రంగా ఖండనీయం’’ అని వారు పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ, టీఆర్‌ఎస్,...