ఐఎంఏ కొత్తగూడెం జనరల్‌ సెక్రటరీగా డా. బి.ఎస్‌.రావు

ఏకగ్రీవంగా ఎన్నిక కొత్తగూడెం, కాకతీయ: కొత్తగూడెంకు చెందిన ప్రముఖ ఈఎన్‌టీ వైద్యుడు డా. బి.ఎస్‌.రావును ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) కొత్తగూడెం శాఖ జనరల్‌ సెక్రటరీగా సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇందుకు సంబంధించిన ప్రకటనను డా. బి.ఎస్‌.రావు బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా డా. బి.ఎస్‌.రావు మాట్లాడుతూ, తనపై నమ్మకంతో ఐఎంఏ జనరల్‌ సెక్రటరీగా ఎన్నుకున్న సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తూ ఐఎంఏ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం మరింత చేరువయ్యేలా కృషి చేస్తానని...