ఘనంగా ముగిసిన మండల్‌ బ్లాక్‌ లెవెల్‌ క్రీడలు

బాలుర కబడ్డీలో తెలంగాణ మోడల్‌ జూనియర్‌ కాలేజీ విజయం కాకతీయ, నెల్లికుదురు: మేరా యువ భారత్‌ వరంగల్‌ ఆధ్వర్యంలో నెల్లికుదురు మండల కేంద్రంలో నిర్వహించిన మండల్‌ బ్లాక్‌ లెవెల్‌ క్రీడలు బుధవారం ఘనంగా ముగిశాయి. ఈ క్రీడల్లో బాలుర కబడ్డీ విభాగంలో తెలంగాణ మోడల్‌ జూనియర్‌ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచి ప్రథమ బహుమతిని సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆదర్శ కళాశాల ప్రిన్సిపాల్‌ ఉపేందర్‌రావు మాట్లాడుతూ, క్రీడలు విద్యార్థుల జీవితంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. మానసిక, శారీరక ధృడత్వాన్ని పెంపొందించడంలో క్రీడలు ఎంతగానో...