ప్రశాంతంగా మూడో దశ పంచాయతీ ఎన్నికలు

డ్రోన్‌లతో పర్యవేక్షించిన సీపీ గౌష్‌ ఆలం కరీంనగర్, కాకతీయ: కరీంనగర్‌ జిల్లాలో మూడో దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. ఎన్నికల నిర్వహణను పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. డ్రోన్‌ కెమెరాల సహాయంతో పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్ల క్యూలైన్లు, బందోబస్తు ఏర్పాట్లు, ఓటర్ల కదలికలను సీపీ నిరంతరం గమనిస్తున్నారు. మూడో దశ ఎన్నికలు జరుగుతున్న ఐదు మండలాల్లోని పలు పోలింగ్‌ కేంద్రాలను ఆయన స్వయంగా సందర్శించారు. ఎన్నికల విధుల్లో ఉన్న పోలీస్‌ సిబ్బంది పనితీరును, పోలింగ్‌ కేంద్రాల...