‘సర్’పంచ్..!
గూడెంలో రెండు పార్టీల మధ్య ముదురుతున్న అంతర్గత పోరు చుంచుపల్లి మండలంలో సర్పంచ్‌కు కోటి రూపాయల ఆఫర్ కాకతీయ, కొత్తగూడెం ప్రతినిధి: మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న వేళ రాజకీయాలు ఆసక్తికర మలుపులు తిరుగుతున్నాయి. తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు అన్ని పార్టీలు వ్యూహాలు రచిస్తుండగా, గత రెండు విడతల్లో గెలిచిన కొందరు సర్పంచులు మాత్రం పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. చుంచుపల్లి మండలంలో ఒక పార్టీ మద్దతుతో సుమారు రూ.50 లక్షలు ఖర్చు చేసి సర్పంచ్‌గా గెలిచిన ఓ అభ్యర్థికి...