పోలింగ్ సరళిని పరిశీలించిన ఎస్పీ
సమస్యాత్మక కేంద్రాల తనిఖీ కొత్తగూడెం, కాకతీయ: భద్రాద్రి జిల్లాలో బుధవారం జరిగిన మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. జిల్లాలో పంచాయతీ ఎన్నికల మూడో విడత పోలింగ్‌లో భాగంగా జూలూరుపాడు మండలం పాపకొల్లు, సుజాతనగర్ మండలం సర్వారం, లక్ష్మీదేవిపల్లి మండలం చాతకొండ, టేకులపల్లి, దాసుతండా పోలింగ్ కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల్లో విధుల్లో ఉన్న ఎన్నికల అధికారులు, పోలీస్ అధికారులు, సిబ్బందికి...