ప్రశాంతంగా ముగిసిన మూడో దశ పంచాయతీ పోలింగ్
కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు సమస్యాత్మక గ్రామాల్లో కట్టుదిట్టమైన బందోబస్తు ఖమ్మం, కాకతీయ ప్రతినిధి: జిల్లాలో నిర్వహించిన మూడో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. పోలింగ్ అనంతరం ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా శాంతియుతంగా కొనసాగుతోందన్నారు. పెనుబల్లి మండలం చింతగూడెం, ఏరుగట్ల, లంకపల్లి, అలాగే కల్లూరు మండలం ఎర్రబోయినపల్లి గ్రామ పంచాయతీల్లోని పోలింగ్ కేంద్రాలను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సందర్శించి, ఎన్నికల బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. భద్రతలకు విఘాతం కలగకుండా సమస్యాత్మక గ్రామాల్లో...