సుక్మా అడవుల్లో ఎన్‌కౌంటర్!
సుక్మా అడవుల్లో ఎన్‌కౌంటర్! ముగ్గురు మావోయిస్టులు హతం భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాల స్వాధీనం కాకతీయ, తెలంగాణ బ్యూరో : చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో భద్రతా బలగాలు–మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. మృతుల్లో ఒక మహిళా మావోయిస్టు కూడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఎన్‌కౌంటర్ డిసెంబర్ 18 గురువారం ఉదయం సుక్మా జిల్లా గొల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కోనగుడ–దులేడ్ అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది.డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డీఆర్‌జీ), బస్తర్ ఫైటర్స్ దళాలు సంయుక్తంగా గాలింపు చర్యలు...