మృతుడి కుటుంబానికి మిత్రుల ఆర్థిక సాయం

మృతుడి కుటుంబానికి మిత్రుల ఆర్థిక సాయం కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన విజ్జిగిరి విజేందర్ ఇటీవల జరిగిన బైక్ ప్రమాదంలో మృతి చెందారు. ఈ ఘటనతో తీవ్రంగా విషాదంలో మునిగిపోయిన కుటుంబానికి అండగా నిలవాలనే ఉద్దేశంతో ఆయన చిన్ననాటి స్నేహితులు ముందుకొచ్చారు. అకాల మరణంతో కుటుంబం ఎదుర్కొంటున్న పరిస్థితిని తెలుసుకున్న స్నేహితులు మృతుడి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారికి ధైర్యం చెప్పడంతో పాటు ఆర్థిక ఓదార్పుగా రూ.15,000 నగదును అందజేశారు....