పార్లమెంట్ కార్యాలయం వద్ద పొలిటికల్ వార్!

పార్లమెంట్ కార్యాలయం వద్ద పొలిటికల్ వార్! కరీంనగర్‌లో కాంగ్రెస్–బీజేపీ ఢీ… నినాదాలతో రణరంగం కాకతీయ, కరీంనగర్ : క‌రీంన‌గ‌ర్ బీజేపీ కార్యాల‌యం వ‌ద్ద గురువారం హైటెన్ష‌న్ నెల‌కొంది. నేషనల్ హెరాల్డ్ కేసు అంశాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించగా, అక్కడికి చేరుకున్న బీజేపీ శ్రేణులతో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పరం నినాదాలు చేసుకుంటూ హోరాహోరీగా ఎదురుదిరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కాంగ్రెస్ కార్యకర్తలు పార్లమెంట్ కార్యాలయం వైపు ర్యాలీగా చేరేందుకు ప్రయత్నించగా, ముందుగానే అప్రమత్తమైన పోలీసులు అడ్డుకున్నారు....