యాప్ ద్వారా యూరియా పంపిణీ

యాప్ ద్వారా యూరియా పంపిణీ రబీ సీజన్ నుంచి అమలు మండల వ్యవసాయశాఖ అధికారి వినయ్ కుమార్ కాకతీయ, నర్సింహులపేట : ప్రస్తుత రబీ సీజన్ నుంచి రైతులకు ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా యూరియాను పంపిణీ చేయనున్నట్లు మండల వ్యవసాయశాఖ అధికారి వినయ్ కుమార్ తెలిపారు. గురువారం రైతు వేదికలో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. రైతుల ఆధీనంలో ఉన్న భూమి విస్తీర్ణాన్ని బట్టి మూడు నుండి నాలుగు సార్లు స్లాట్ బుకింగ్ చేసుకొని ఎరువులు పొందే అవకాశం ఉంటుందని...