నెలల గడుస్తున్నా కదలని అభివృద్ధి పనులు!
నెలల గడుస్తున్నా కదలని అభివృద్ధి పనులు! గుత్తేదారుల నిర్లక్ష్యంతో ఆగిన పనులు కాగితాలకే పరిమితమైన టెండర్లు వార్డుల్లో పెండింగ్‌లో కీలక ప్రాజెక్టులు నోటీసులతో సరిపెడుతున్న అధికారులు కాకతీయ, రామకృష్ణాపూర్ : క్యాతన్‌పల్లి పురపాలక పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు నెలలుగా ప్రారంభం కాకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. వార్డుల వారీగా కేటాయించిన పనులు కేవలం ఆన్‌లైన్, కాగితాలకే పరిమితమయ్యాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులు టెండర్ ప్రక్రియ పూర్తి చేసినప్పటికీ, పనులు దక్కించుకున్న గుత్తేదారులు నెలల తరబడి కాలయాపన చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సీసీ డ్రైనేజీ,...