గ్రామాభివృద్ధికి సర్పంచులే పునాది
గ్రామాభివృద్ధికి సర్పంచులే పునాది మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ రాజాపూర్ సర్పంచ్, వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక కాకతీయ, కరీంనగర్ : గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర అత్యంత కీలకమని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. భేషజాలకు పోకుండా వార్డు సభ్యులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగితేనే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. శుక్రవారం ఎల్ఎండీ కాలనీలోని ప్రజాభవన్‌లో తిమ్మాపూర్ మండలం రాజాపూర్ గ్రామ సర్పంచ్ (స్వతంత్ర) కొంకటి రవి, వార్డు సభ్యులు గాజుల మహేందర్, కుక్కల రాజమ్మ, రెడ్డి...