మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం కాకతీయ, ఇనుగుర్తి: మండల కేంద్రానికి చెందిన కారం పూరిరామ స్వామి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో ఆయన కుటుంబానికి అయ్యగారిపల్లి గ్రామ సర్పంచ్ మలిశెట్టి శోభన్ ఆర్థిక సహాయం అందజేశారు. శనివారం మృతుని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా 50 కేజీల బియ్యంతో పాటు నగదు సహాయాన్ని కుటుంబానికి అందజేశారు. బాధిత కుటుంబానికి గ్రామపంచాయతీ తరఫున అన్ని విధాల సహకారం అందిస్తామని సర్పంచ్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప...