సమన్వయంతోనే పంచాయతీ ఎన్నికలు సజావు

సమన్వయంతోనే పంచాయతీ ఎన్నికలు సజావు తహసిల్దార్ ఎండి. రియాజుద్దీన్ కాకతీయ, గీసుగొండ : అన్ని శాఖల అధికారుల సమన్వయంతో గ్రామ పంచాయతీ రెండవ సాధారణ ఎన్నికలను ప్రశాంతంగా, సజావుగా పూర్తిచేశామని గీసుగొండ తహసిల్దార్ ఎండి. రియాజుద్దీన్ తెలిపారు. ఎన్నికల నిర్వహణకు సహకరించిన అధికారులకు అభినందనలు తెలియజేస్తూ మండల కేంద్రంలోని ప్రజాపరిషత్ కార్యాలయంలో విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ప్రక్రియలో రెవెన్యూ, పంచాయతీ రాజ్, పోలీస్ తదితర శాఖల మధ్య పూర్తి స్థాయి సమన్వయం ఉండటంతో ఎలాంటి అవాంతరాలు తలెత్తలేదని...