రాజ్యాంగ రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
రాజ్యాంగ రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ కాకతీయ, కొత్తగూడెం : భారత రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత న్యాయస్థానాలు, న్యాయవాదులకే పరిమితం కాదని, ప్రతి పౌరుడిపైనా ఉందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ స్పష్టం చేశారు. సమానత్వం, సామాజిక న్యాయం, సోదరభావం లక్ష్యాలతో రూపొందిన రాజ్యాంగ విలువలను పరిరక్షించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. శనివారం కొత్తగూడెం క్లబ్‌లో ఐ.ఎల్.పీ.ఏ జాతీయ అధ్యక్షురాలు కె. సుజాత చౌదంతి అధ్యక్షతన నిర్వహించిన ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్...