నీటి కోసం కాలి బిందెలతో నిరసన!
నీటి కోసం కాలి బిందెలతో నిరసన! “పది రోజులుగా తాగునీరు లేదు” “మిషన్ భగీరథ పైపులే పనికిరావడం లేదు” “అధికారుల నిర్లక్ష్యంపై మహిళల ఆగ్రహం” నర్సంపేట మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో ధర్నా కాకతీయ, నర్సంపేట టౌన్ : వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని 1వ వార్డు ఎన్జీవోస్ కాలనీలో తాగునీటి సమస్య తారస్థాయికి చేరింది. గత పది రోజులుగా నీటి సరఫరా నిలిచిపోవడంతో విసిగిపోయిన మహిళలు మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో ధర్నాకు దిగారు. మున్సిపల్ సిబ్బంది పాత పైపులైన్లు...