మండల స్థాయి టాలెంట్ టెస్ట్‌లో విద్యార్థుల ప్రతిభ

మండల స్థాయి టాలెంట్ టెస్ట్‌లో విద్యార్థుల ప్రతిభ కాకతీయ, జూలూరుపాడు : మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ గణిత ఫోరం ఆధ్వర్యంలో జాతీయ గణిత దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల స్థాయి టాలెంట్ టెస్ట్‌ను నిర్వహించారు. ఈ టాలెంట్ టెస్ట్‌కు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నర్సయ్య ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… విద్యార్థులు మండల స్థాయిలోనే కాకుండా జిల్లా, రాష్ట్ర స్థాయిల్లోనూ ఉత్తమ ప్రతిభ కనబర్చి తమ పాఠశాలలకు, మండలానికి...