మహాలక్ష్మితో లాభాల్లోకి ఆర్టీసీ
మహిళల ప్రయాణానికి ప్రత్యేక కార్డులు నిజామాబాద్, వరంగల్‌కు 100 ఎలక్ట్రిక్ బస్సులు విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు బుక్స్, యూనిఫామ్స్, షూస్ రజక, నాయి బ్రాహ్మణ కుల వృత్తులకు ఉచిత విద్యుత్ బిల్లులు ఉప ఉఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆర్టీసీ, బీసీ సంక్షేమశాఖ అధికారులతో సమీక్ష కాకతీయ, తెలంగాణ బ్యూరో: మహాలక్ష్మి పథకం వల్ల ఆర్టీసీ లాభాల్లోకి వచ్చిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. అదే విధంగా ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంక్షేమ హాస్టళ్లలోని నిరుపేద విద్యార్థులకు కాస్మోటిక్, మెస్ ఛార్జీలను 200...