పాముకాటుతో అన్నదాత మృతి
పాముకాటుతో అన్నదాత మృతి పొలంలో పనిచేస్తుండగా విష సర్పం కాటు కాకతీయ, నల్లబెల్లి : నల్లబెల్లి మండలంలోని లెంకాలపల్లి గ్రామంలో పాముకాటుతో ఓ రైతు మృతి చెందిన విషాద ఘటన సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం… లెంకాలపల్లి గ్రామానికి చెందిన యాదండ్ల చిన్న కొమురయ్య (50) శుక్రవారం తన వ్యవసాయ భూమిలో మక్కజొన్న పంట పనులు చేస్తూ ఎడ్లకు మేత వేస్తున్న సమయంలో విషసర్పం చేతికి కాటు వేసింది. అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు,...